- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోస్టు కొవిడ్ లో కొత్త సమస్య.. ఇద్దరు మృతి, నలుగురికి ఆపరేషన్లు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా ప్రభావంతో జనాలు రోజుకో కొత్త సమస్యతో బాధపడుతున్నారు. వైరస్‌నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకునే లోపే పోస్ట్కొవిడ్ సమస్యలు తలెత్తడం ఆందోళనకరం. కోలుకున్న వారిలో ఇప్పటి వరకు లంగ్స్, లీవర్, హార్ట్, కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటివి అత్యధికంగా ప్రభావం చూపగా, తాజాగా కడుపులోని పేగులు కూడా ఖరాబ్ అవుతున్నట్లు నిమ్స్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగం అధ్యయనంలో తేలింది. గడిచిన వారంలో ఆరుగురు పేషెంట్లు ఈ సమస్యతో ఆసుపత్రికి రాగా, వీరిలో ఇద్దరు మృతి చెందినట్టు ఆ విభాగం హెచ్ఓడీ డా బీరప్ప శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మరో నలుగురికి ఇన్ఫెక్షన్ ను తొలగించేందుకు పేగులకు సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు. కానీ వారు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి చాలా సమయం పడుతుందన్నారు. కొవిడ్ నుంచి కొలుకున్న తర్వాత చాలా మంది బ్లడ్ థిన్నర్స్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని, దీని వలనే సమస్య వస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. కావున రికవరీ తర్వాత కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎందుకు ఇలా జరుగుతున్నది?
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో కడుపులోని పేగులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో క్లాట్స్ ఏర్పడుతున్నాయి. దీని కారణాన పేగుల్లో ఇన్ ఫెక్షన్ పుండ్లు(గ్యాంగ్రేన్) వస్తున్నాయి. వాస్తవానికి కోమార్బిడ్ పేషెంట్లలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా వస్తుండగా.. ప్రస్తుతం ఎలాంటి దీర్ఘకాలిక, ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోయినా రక్తం గడ్డ కడుతున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అది కూడా యువతలోనే ఎక్కువగా జరగడం గమనార్హం. నిమ్స్ కు వచ్చిన ఆరుగురిలో ముగ్గురు పైకి ఆరోగ్యవంతంగా ధృడంగా ఉన్నా, లోలోపల ఇన్ఫెక్షన్ దాడి చేసింది. దీంతో సీరియస్ అయిన బాధితుల పేగుల్లోని కొంత భాగాన్ని డాక్టర్లు తొలగించారు. అయితే నిమ్స్‌కు వచ్చిన ఆరుగురు బాధితులకు తెలియకుండానే వైరస్ యంటీబాడీలు ఉన్నాయి. అంటే అసింప్టమాటిక్ తో కొవిడ్ వచ్చిపోయినట్టు గుర్తించారు. వీరిలో ఇద్దరు ఒక్కో డోసు వ్యాక్సిన్ తీసుకోగా, మిగిలిన నలుగురు అసలు టీకా పొందలేదు.
డాక్టర్లు సూచన మేరకు బ్లడ్ థిన్నర్లు వాడాలి: డా బీరప్ప గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగం హెచ్ఓడీ
కొవిడ్ నుంచి కోలుకున్నత ర్వాత కూడా కొంత కాలం వరకు బ్లడ్థిన్నర్లు వాడాల్సి ఉంటుంది. చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా స్టెరాయిడ్స్ తీసుకున్నోళ్లు కోలుకున్న తర్వాత తప్పనిసరిగా బ్లడ్ థిన్నర్లు వాడాలి. అయితే డయేరియా, కడుపునొప్పి, కడుపు ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. సమస్యను త్వరగా గుర్తించి చికిత్స పొందితే సులువగా కోలుకోవచ్చు. ఆలస్యం చేస్తే పేగులను తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. సాధారణ రోజుల్లో ఇలాంటి పేషెంట్లు ప్రతీ సంవత్సరానికి ఆరుగురు వస్తుంగా, ప్రస్తుతం వారం రోజుల లోపే ఆరుగురు రావడం ఆందోళనను గురి చేసింది.