పోసాని ఘాటు వ్యాఖ్యలపై పవన్ కౌంటర్.. కుక్కలు మొరుగుతాయ్ అంటూ

by Anukaran |
పోసాని ఘాటు వ్యాఖ్యలపై పవన్ కౌంటర్.. కుక్కలు మొరుగుతాయ్ అంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతోన్నాయి. డైరెక్ట్ గా మంత్రులను ఇన్ వాల్వ్ చేయడంతో పవన్ పై జగన్ ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తోంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు తమదైన రీతిలో పవన్ వ్యాఖ్యలను ఖండించారు. ఇక తాజాగా నటుడు, దర్శక నిర్మాత పోసాని కృష్ణ మురళి, పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ తో పోల్చుకొనే వ్యక్తిత్వం పవన్ కి ఉందా..? అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాకుండా సినీ పరిశ్రమలో ఉన్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

సోమవారం మీడియా ముందుకు వచ్చిన పోసాని మాట్లాడుతూ..” పవన్ మీ గురించి అందరికి తెలుసు.. మీరు జగన్‌తో పోల్చుకోవద్దు. జగన్‌ రాకముందు గవర్నమెంట్‌ స్కూళ్ల పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఏమిటి. పవన్‌ ఏ పార్టీతో సరిగ్గా ఉన్నావు. ఏ పార్టీని మిగిల్చావు అంటూ రెచ్చిపోయారు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఏదో సినిమాలో ఆడవారికి కష్టమొస్తే ముందు ఉంటా అన్నావ్ కాబట్టి చెప్తున్నా.. ఎన్నో ఆశలతో హీరోయిన్ అవుదామని ఒక పంజాబీ యువతి ఇండస్ట్రీలోకి వస్తే ఓ ప్రముఖుడు అవకాశం ఇస్తానని ఆ పంజాబీ అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఆ అమ్మాయికి కడుపు చేసి.. అబార్షన్ చేయించుకో.. ఈ విషయం బయటపెడితే నిన్ను కనపడకుండా చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడంట. అలా బెదిరించి ఆ అమ్మాయిని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లి అబార్షన్ చేయించాడని నేను విన్నాను.. ఆ యువతి బెదిరిపోయి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. మీడియా ముందు ఆమె పేరు చెప్పకూడదు కాబట్టి.. నువ్వు న్యాయం చేస్తానంటే నీ చెవిలో ఆమె పేరు చెప్తా.. వెళ్లి న్యాయం చేయి” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం పోసాని మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. పోసాని వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజం మాట్లాడితే.. వారిపై ఇలాంటి కౌంటర్లు వేస్తారని కొందరు.. పోసానికి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు.. ఇక్కడ జరిగిన విషయం ఏంటి.. ఆయన మాట్లాడేదేంటి అని మరికొందరు తమదైన రీతిలో ఏకిపారేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఆ ప్రముఖుడు ఎవరు..? ఆ యువతి ఎవరు అంటూ సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇక ఈ వ్యాఖ్యలపై జనసేనాని స్పందించారు. ట్విటర్‌ వేదికగా పోసాని మాటలకి కౌంటర్‌ ఇచ్చారు. ‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే’ అని రాసుకొచ్చారు. ‘హు లెట్‌ ది డాగ్స్‌ ఔట్‌’ అనే పాటని షేర్‌ చేస్తూ ‘నాకు ఇష్టమైన పాట’ ఇది తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed