- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూపై పోసాని సెటైర్
దిశ, వెబ్‌డెస్క్: సోనూ సూద్.. రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్రభుత్వాలు చేయలేని సాయం చేసి ప్రజలచే దేవుడిగా కీర్తించబడ్డాడు. సమస్య కనబడితే చాలు పరిష్కారం చూపించేందుకు, జనాలకు మంచి చేసేందుకు తాపత్రయపడుతున్నాడు. ఈ సహాయం చేసే గుణమే ప్రజలకు నచ్చింది.. ఆయనను హీరోను చేసింది.. తనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను కూడా తెరమీదకి తెచ్చేలా చేసింది.
అలా అందరూ సోనూ మంచి మనస్సును ప్రశంసిస్తుంటే.. పోసాని కృష్ణమురళి మాత్రం కాస్త వ్యంగ్యంగానే మాట్లాడారు. సోనూసూద్ హెల్ప్ చేస్తే భారత్ మొత్తం బాగుపడుతుందా ఏంటి? అన్నట్లు మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీలోనూ సోనూసూద్‌లాగా హెల్ప్ చేసిన హీరోలు ఉన్నారని.. మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కోట్లల్లో విరాళాలు ఇచ్చిన విషయం మరిచిపోకూడదన్నారు. కానీ, ఇచ్చిన ప్రతీ పైసాకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునే స్టైల్ మనవాళ్లది కాదని అన్నారు.
సోనూ చేశాడు.. మన హీరోలు చేయలేకపోయారు అనేది చాలా తప్పు అని.. దీన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పాడు. తను కూడా కరోనా సమయంలో చాలా హెల్ప్ చేశానని.. అలాగని మీడియా ముందుకు వచ్చి చెప్పలేదన్నాడు. సహాయం చేసే వాడికి.. సహాయం పొందే వాడికి ఆ విషయం తెలిస్తే చాలన్నాడు. సోనూకు దేశం మీద లేక ప్రజల మీద లేక మరేదానిపై అయినా ప్రేమ ఉందా? తెలియదని పరోక్షంగా విమర్శించారు. ఆయన కంటే బ్రాడ్ మైండ్ మన తెలుగు కథానాయకులు, నిర్మాతలు, దర్శకులకు ఉందన్నారు పోసాని.