విదేశాల్లో హెల్త్ డ్రింక్‌గా ‘గంజి’

by Shyam |
విదేశాల్లో హెల్త్ డ్రింక్‌గా ‘గంజి’
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ ఆచార సంప్రదాయాలు చాలా పురాతనమైనవి. ఆధునికత పెరిగే కొద్దీ.. డ్రెస్సింగ్ స్టైల్ నుంచి ఆహారపు అలవాట్ల వరకు గణనీయమైన మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రాచీన, పాశ్చాత్య పద్ధతుల్లో ఏది బెటర్ అనే చర్చ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విదేశీయులు భారతీయ సంప్రదాయాలను పాటించడం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ డిస్కషన్‌కు ‘గంజి’ కారణమైంది. మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ కుక్కర్లు ఎంటర్ అయ్యాక, ఇంతకుముందులా అన్నం వండేటప్పుడు గంజి వార్చే పద్ధతి చాలావరకు తగ్గిపోయింది. కానీ డెన్మార్క్‌లో మార్కెట్‌లో మాత్రం ఇప్పుడు ‘గంజి’ నయా ట్రెండ్ సృష్టిస్తోంది. మనం గంజిని వ్యర్థంగా బయట పారబోస్తుంటే అక్కడ మాత్రం డబ్బులిచ్చి మరీ కొంటున్నారట. ఈ ఆలోచన వారికి ఎలా వచ్చింది? అసలు గంజిలో ఏ పోషకాలుంటాయో? ఇక్కడ తెలుసుకుందాం.

కొందరికి అన్నం పుల్లలుపుల్లలుగా ఉండటం ఇష్టమైతే, మరికొందరికి మెత్తగా జావలా ఉండటం ఇష్టం. మరి పుల్లలుగా ఉండాలంటే తప్పకుండా గంజి వార్చాల్సిందే. పల్లెటూర్లలో ఇప్పటికీ ఇదే పద్ధతిని ఫాలో అవడం చూస్తుంటాం. అయితే ఇలా చేయడం ద్వారా గంజితో పాటు పోషకాలు వృథాగా పోతుంటాయి. ఇలా పోషకాలు వృథా పోకుండా గంజిని ప్యాకెట్లుగా సిద్ధం చేసి అమ్ముతున్నారు. బెంజి కార్లలో తిరిగే విదేశీయులు గంజిని హెల్త్ డ్రింక్‌గా తాగుతున్నారు. డెన్మార్క్ దేశంలో గంజికి ఇంకా కొన్ని పోషకాలను జత చేసి ఎనర్జీ డ్రింక్‌గా మార్చుతున్నారు. ప్రతి స్టోర్ వద్ద ‘నాచుర్లి రిస్ డ్రిక్(Naturli risdrik)’ పేరిట గంజి ప్యాకెట్లు లభిస్తున్నాయి. గంజి అరలీటర్ ప్యాకెట్‌కు ధర రూ.120 పలుకుతోంది. సాధారణంగా ఆవు లేదా గేదే పాలు తాగినట్లుగానే వాళ్లు గంజిని బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ టైమ్‌లో తాగుతున్నారు. ఇందులో అన్నం వండగా వచ్చిన గంజితో పాటు పొద్దుతిరుగుడు పువ్వు నూనెను కలుపుతుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed