సామ్ పై పూజ నెగిటివ్ పోస్ట్.. హ్యాకర్స్ పనే!

by Shyam |   ( Updated:2020-05-28 03:04:28.0  )
సామ్ పై పూజ నెగిటివ్ పోస్ట్.. హ్యాకర్స్ పనే!
X

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ మధ్య ఒకప్పుడూ చాలా మనస్పర్థలు ఉండేవి. శ్రీదేవి, జయప్రద మధ్య కోల్డ్ వార్ నడిచేదట. అందంలో ఇద్దరూ పోటీ పడేవారని టాక్. ఒక సినిమాకు ఇద్దరు హీరోయిన్లు పని చేస్తే కచ్చితంగా క్లాషేస్ వస్తుంటాయి. కాస్ట్యూమ్స్, మేక్ అప్ నుంచి సీన్స్ వరకు.. ప్రతీ దాంట్లోనూ కంపేరిజన్ ఉంటుంది.

పూజ అకౌంట్ హాక్

అయితే ఇప్పుడు పరిస్థితి మారింది అనుకున్న టైమ్ లో.. తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే .. లేడీ సూపర్ స్టార్ సమంత పై ఇన్ స్టాగ్రామ్ లో ఓ అభ్యంతరకర పోస్ట్ పెట్టడం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈ పోస్ట్ తాను పెట్టలేదని.. ఎవరో తన అకౌంట్ హ్యాక్ చేసి ఈ పోస్ట్ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చింది పూజ. ఈ అకౌంట్ నుంచి వచ్చిన పోస్ట్ ల గురించి పట్టించుకోవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరింది.

https://twitter.com/hegdepooja/status/1265721316142755841?s=19

ఇప్పుడు ఓకే..

అయితే ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ తన హ్యాండ్‌లోకి వచ్చినట్లు తెలుపుతూ మరో ట్వీట్ చేసింది పూజ. ఇప్పుడు చాలా హ్యాపీ ఉందని చెప్పిన పూజ..ఇందుకోసం సహాయం చేసిన సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పింది. ఒక్క గంటలోనే అకౌంట్‌ను నాకు అందించినట్లు చెప్పింది. ఆ తర్వాత తాజా బ్లాక్ బస్టర్ హిట్ అల వైకుంఠ పురంలో చిత్రంలో తన బుట్ట బొమ్మ సాంగ్ పై మూడేళ్ల చిన్నారి చేస్తున్న డాన్స్ వీడియోను పోస్ట్ చేసింది పూజ.

https://twitter.com/hegdepooja/status/1265728246613553152?s=19

Advertisement

Next Story

Most Viewed