మనసు దోచేసిన బుట్టబొమ్మ.. అంత ప్రేముంటే ఎలా?

by Shyam |
pooja
X

దిశ, సినిమా: బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫాలోవర్స్‌ను మరోసారి లవ్‌లో పడేసింది. వీక్ ఎండ్ ఎంజాయ్ చేసిన అభిమానుల వీక్ స్టార్ట్ మూడ్‌ను కూల్ అండ్ యాక్టివ్‌గా ఉంచేందుకు చేసిన క్యూట్ స్టంట్ ఫిదా చేసేసింది. ‘మిమ్మల్ని హగ్ చేసుకోవాలనుకుంటున్నాను.. కానీ కుదరదు.. అందుకే ఇలా మీ ప్లేస్‌లో దిండును హత్తుకుంటున్నాను’ అని ఫాలోవర్స్‌ కోసం స్వీట్ అండ్ ప్రెట్టీ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోతో అభిమానులు ఫిదా అయిపోగా, కామెంట్ సెక్షన్ కాంప్లిమెంట్స్‌తో నిండిపోయింది. కాగా పూజ తెలుగులో నటించిన ‘రాధే శ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు సిద్ధం కాగా.. ఈ మధ్యే విజయ్‌తో తమిళ్ ప్రాజెక్ట్ ప్రకటించింది. ఇక హిందీలో రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్‌తో ఇప్పటికే ప్రాజెక్ట్స్ కమిట్ అయింది.

Advertisement

Next Story