- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి పాత్రలకు చాలా టైమ్ ఉంది: పూజ
పూజా హెగ్డే.. ప్రజెంట్ స్టార్ హీరోల ఫస్ట్ ప్రిఫరెన్స్. వరుస హిట్లతో దూసుకుపోతున్న భామ.. ఎలాంటి పాత్ర ఇచ్చిన చేయగలదు అనే నమ్మకం దర్శకులకు తెచ్చింది. గ్లామరస్ డోస్ కూడా ఎక్కువగానే ఇస్తుంది కాబట్టి.. ఇటు గ్లామర్ అటు యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించగలదని నమ్ముతున్నారు. అందుకే లేడీ ఓరియంటెడ్ మూవీ స్క్రిప్ట్ లతో పూజా తలుపు తడుతున్నారట. కానీ.. ఇదంతా నాకేం వద్దు.. అలాంటి పాత్రలకు ఇంకా టైమ్ ఉందని చెప్తోంది పూజా.
ఒక వయసు వరకు మాత్రమే గ్లామర్, లవర్ పాత్రలు చేయగలం కాబట్టి.. ఆ రోల్స్ ఆస్వాదిస్తానని చెప్తోంది. మరో పదేళ్లకు ఎలాగూ సీరియస్ రోల్స్ చేయాల్సి వస్తుంది.. ఆ టైంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ గురించి ఆలోచిస్తాను అని చెప్తోంది. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల్లోనూ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నాను అని చెప్తోంది పూజా. అయితే.. ఏ యాక్టర్ అయినా నటనా ప్రాధాన్యమున్న పాత్రలనే ఇష్టపడతారు.. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే నటనాపరంగ మంచి పేరు, గుర్తింపు కలగడంతో పాటు సినీ చరిత్రలో తమకంటూ ప్రత్యేకత ఉంటుందని చెప్తుంటారు. ఎవరైనా లవర్, గాళ్ ఫ్రెండ్ పాత్రలు చేయగలరు కానీ..ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే రోల్స్ దొరకడం అరుదు అని చెప్తుంటారు. కానీ ఆ అదృష్టం తలుపుతట్టినా పూజ కాదనడం ఏంటో అర్థం కావడం లేదని అనుకుంటున్నారు.