- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా లక్షణాలతో సల్మాన్ హీరోయిన్..
– ఆదుకోవాలంటూ సల్లూ భాయ్‌కు విజ్ఞప్తి
ఒకప్పుడు స్టార్‌డమ్ అనుభవించిన చాలా మంది.. ఆ తర్వాత తిండికి లేక ఇబ్బందులు పడటం చూస్తుంటాం. స్టార్ రేంజ్ ఉన్నప్పుడు డబ్బులను వెదజల్లిన వారే.. సరైన ప్లానింగ్ లేక ఉన్నదంతా పోగొట్టుకుని డబ్బుల కోసం ఎదుటివారి ముందు చేతులు చాచడమూ చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితే ఎదురైంది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కో యాక్టర్ ‘పూజ దద్వాల్’కు. వీర్గతి సినిమాలో సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజ.. సల్మాన్‌ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం గోవాలో ఉంటున్న పూజ.. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్లు వివరించింది. దగ్గు, జలుబు, జ్వరం, బాడీ పెయిన్స్‌తో పాటు కొంచెం కొంచెంగా రుచి కూడా కోల్పోతున్నట్లు తెలిపింది. చుట్టుపక్కల ఉన్న నలుగురికి కూడా కరోనా వచ్చినట్లు తెలిపిన ఆమె.. టెస్ట్ చేయించుకునే స్థోమత కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే స్నేహితుల దగ్గర సహాయం పొందానని.. ఇప్పుడు ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పింది. సల్లూ భాయ్ మాత్రమే నన్ను ఆదుకోగలడనే భరోసాతో ఉంది.
కాగా లాక్‌డౌన్ కాలంలో కొన్ని వేల కుటుంబాలను ఆదుకున్న సల్మాన్.. తోటి నటి పూజ దద్వాల్‌కు ఇంతకు ముందు కూడా హెల్ప్ చేశాడు.