- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది అవాస్తవ బడ్జెట్: పొన్నాల లక్ష్మయ్య
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ర్ట ప్రభుత్వం అవాస్తవ బడ్జెట్ ప్రవేశ పెట్టిందని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్థిక మాంద్యంతో 6 శాతానికే వృద్ధిరేటు తగ్గిందన్నారు. 2019-20 బడ్జెట్‌ను రూ. 1 లక్షా 34 వేల కోట్లకు కుదించిన నేపథ్యంలో.. ప్రస్తుత బడ్జెట్ రూ. 1 లక్షా 82 వేల కోట్లకు పెంచి ప్రవేశ పెట్టడం మోసపూరితమన్నారు. గత బడ్జెట్ కంటే ప్రస్తుత బడ్జెట్‌లో సుమారుగా రూ. 50 వేల కోట్లు అదనంగా పెంచడమంటే, 40 శాతం వృద్ధి ఎలాసాధ్యమౌతుందని ప్రశ్నించారు. అందుకే ఇది మోసపూరిత, అవాస్తవ బడ్జెట్ అని ప్రజలకు అర్ధం అవుతుందన్నారు. ఈ ఏడాదిలో లక్ష ఇళ్లు కట్టిస్తామని బడ్జెట్‌లో చెప్పడం అంటే, అర్హులందరికీ ఇళ్లు రావాలంటే 20 ఏళ్లకు పైగానే పడతుందని చురకలు వేశారు. కాళేశ్వరం కోటి ఎకరాలపై కేసీఆర్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరంగా గిరిజనులుకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తూ.. కాలయాపన చేస్తున్నారని పొన్నాల మండిపడ్డారు. మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లను 4 మాసాలలోనే కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పిన కేసీఆర్ 6 సంవత్సరాలు గడిచినా అతీగతీ లేదన్నారు. దీనిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.
tag: Ponnala lakshmaiah, comments, budget, telangana