కెమికల్ వేస్ట్‌తో ప్రమాదకరంగా చెరువులు

by Shyam |

దిశ, మెదక్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో వర్షాలు పడుతున్నాయి. దీంతో పరిశ్రమల నిర్వాహకులు ప్రమాదకర రసాయనాలను బయటకు వదులుతున్నారు. అవి కాలువల ద్వారా ప్రవహించి చెరువులు, కుంటలకు చేరుతున్నాయి. దీంతో అందులోని నీళ్లు పూర్తిగా కలుషితమవుతున్నాయి. ప్రమాదకర వ్యర్థ జలాలను బయటకి వదల రాదని నిబంధనలు ఉన్నా పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఎల్లప్పుడూ నిఘా ఉంచాల్సిన పీసీబీ అధికారులు నిద్రావస్థలో ఉండటంతో పరిశ్రమల యజమానులు నిబంధనలకు తూట్లు పొడిచారు. ఉమ్మడి జిన్నారం మండలంలోని బొల్లారం, బొంతపల్లి, కాజిపల్లి, గడ్డపోతారం, పారిశ్రామికవాడలో వ్యర్థాల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారీ వ్యర్థ జలాలను బయటకు వదులుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, నిబంధనలు పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed