పోలింగ్ అప్డేట్ : మధ్యాహ్నం 1 గంట వరకు ఎంత శాతం అంటే..?

by Shyam |   ( Updated:2021-04-17 03:10:18.0  )
పోలింగ్ అప్డేట్ : మధ్యాహ్నం 1 గంట వరకు ఎంత శాతం అంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నాగార్జున సాగర్ లో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతుండగా, ఈ రోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును ఆ నియోజకవర్గ ప్రజలు వినియోంచుకుంటున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు 53.3 శాతం ఓట్లు పోల్ అయ్యాయని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా ఎండను కూడా లెక్క చేయకుండా ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

అయితే తిరుపతిలో పార్లమెంటు స్థానానికి ఉపఎన్నికలు జరుగుతుండగా, ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు సంఖ్య పెరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు నియోజవర్గల వారీగా సూళ్లూరుపేట లో 40.76 శాతం, సర్వేపల్లి లో 38.1 శాతం, వెంకటగిరిలో 35 శాతం, శ్రీకాళహస్తిలో 32.9 శాతం, తిరుపతిలో 32.1 శాతం, సత్యవేడు లో 36 శాతం, గూడూరులో 36.84 శాతం ఓట్లు నమోదైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.

Advertisement

Next Story