- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zoom Politics: జూమ్ పాలిటిక్స్.. సంచలన కేసు ఇష్యూ డైవర్షన్ వ్యూహమా..?
దిశ, వెబ్ డెస్క్: Viveka murder case witness gangadhar reddy death issue diverted due to zoom politics| ఏపీలో పదవ తరగతి ఫలితాలు హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు 2 లక్షల విద్యార్థులకు పైనే ఫెయిల్ కావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇది ముమ్మాటికీ వైసీపీ సర్కార్ బాధ్యతారాహిత్యం వలనే జరిగిందంటూ మండిపడుతున్నాయి. అమ్మఒడి పథకంలో కోతలు విధించే ఎత్తుగడ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఉచితంగా రీకౌంటింగ్ జరపాలని, గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం టెన్త్ స్టూడెంట్స్ తో నారా లోకేష్ జూమ్ కాల్ కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ నడుస్తుండగానే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. దీంతో నిర్వాహకులు లైవ్ కట్ చేశారు. కాగా వారి ఎంట్రీపై నారా లోకేష్ చురకలంటించారు. వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారేమో, అందుకే వచ్చి ఉంటారు అంటూ ఎద్దేవా చేశారు. విద్యార్థుల పేరుతో రావడం ఎందుకు దమ్ముంటే నేరుగా చర్చకు రావాలంటూ నారా లోకేష్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
ఇక వారి ఎంట్రీపై టీడీపీ నేతలంతా ఆగ్రహించడం, మీడియాలో ఇదే ప్రధాన వార్త కావడంతో అసలు ఇష్యూ డైవర్ట్ అయిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరు రాజకీయ విశ్లేషకులు ఎప్పటిలానే వైసీపీ సర్కార్ ఇష్యూ డైవర్షన్ ఎత్తుగడ వేసిందంటూ విమర్శిస్తున్నారు. వైఎస్ వివేకా హత్యకేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన గంగాధర్ రెడ్డి మృతి కేసు సైడ్ ట్రాక్ చేయడానికే ఈ పన్నాగం పన్నారంటూ ఆరోపిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లో సంచలనం రేపిన వివేకా హత్యకేసు రాజకీయ రంగు పులుముకుని అనేక మలుపులు తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
గత మూడేళ్ళుగా కొనసాగుతున్న ఈ హత్యకేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. బాబాయి మర్డర్ వెనుక సీఎం జగన్ కుటుంబసభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రధాన ఆరోపణ. వారిని తప్పించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఇదే తరుణంలో కేసులో కీలక సాక్షి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. గంగాధర్ రెడ్డి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతనిది సహజ మరణమా..? ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాగా గతంలో నాకు ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన మరణ వార్త రాష్ట్రంలో ఓ సంచలనం.
ప్రతిపక్షాలు ఈ ఘటనతో వైఎస్ వివేకా హత్యకేసు మరోసారి తెరపైకి తెచ్చి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచడానికి రంగంలోకి దిగేవి. హత్యకేసు నీరుగార్చేందుకే సాక్షుల్ని కనుమరుగు చేస్తున్నారా అంటూ ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఇక మీడియా కూడా ఇదే వార్తపై బ్రేకింగ్స్, లైవ్ డిబేట్స్, స్పెషల్ స్టోరీస్ తో హోరెత్తించేది. కానీ అదే సమయానికి జూమ్ పాలిటిక్స్ మొదలవడంతో సీరియస్ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది అని రాజకీయ విశ్లేషకులు వినిపిస్తోన్న వాదన. అంతేకాదు 10వ తరగతి పరీక్షాఫలితాల వివాదం కూడా జూమ్ పాలిటిక్స్ తో తెరమరుగవడం పక్కా అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.