- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిహాదీలకు అడ్డాగా మారుతున్న తెలంగాణ.. విశ్వహిందూ పరిషత్ డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో హిందువుల హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, తెలంగాణ రాష్ట్రం జిహాదీలకు అడ్డాగా తయారైందని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బాలాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి పవన్ నాయక్ అనే గిరిజన యువకుడిని ముస్లింలు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారని వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. గురువారం రాచకొండ కమిషనర్, మహేశ్వరం డీసీపీలతో మాట్లాడి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ దగ్గరికి వెళ్లి బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తమ కూతురిని ప్రేమిస్తున్నాడని.. అందుకు తమకు మూడు లక్షల రూపాయలు జరిమానా కట్టాలని పవన్ నాయక్ తల్లిదండ్రులను స్థానిక నేతలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. అయితే మూడు లక్షలు కూడా కట్టేందుకు పవన్ నాయక్ తండ్రి ఫుల్ సింగ్ ఒప్పుకున్నారని తెలిపారు. కానీ ఇంతలోనే ఇంటిపై దాడి చేసి కిరాతకంగా పొడిచి చంపడం దుర్మార్గమన్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి రానివ్వకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బతికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా గిరిజనులు, దళితులపైనే రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి హత్యలు చేస్తుందన్నారు. మొన్న ప్రీతి హత్యకు పాల్పడిన సైఫ్ ను.. నేడు పవన్ నాయక్ హత్యకు పాల్పడిన దుండగులను కాపాడేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. పవన్ కుటుంబానికి న్యాయం చేయాలని.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పవన్ నాయక్‌ను హత్య చేసిన దోషులను ఉరితీయాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీ నాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, రేగు అనిల్, మహేష్ యాదవ్ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనకు సిద్ధమవుతామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.