ప్రజాస్వామ్యం కాదు రాజవంశమే ప్రమాదంలో ఉంది.. అమిత్ షా

by Javid Pasha |   ( Updated:2023-04-07 13:16:41.0  )
ప్రజాస్వామ్యం కాదు రాజవంశమే ప్రమాదంలో ఉంది.. అమిత్ షా
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలను దేశ ప్రజలు క్షమించరని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదని రాజవంశమే ప్రమాదంలో ఉందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. సోనియా, రాహుల్ తో పాటు ఎవరెన్నిసార్లు మోడీని విమర్శించినా ప్రజలు మాత్రం మోడీనే ఆదరిస్తున్నారనరని అన్నారు.

బురదలో నుంచి కమలం వికరించినట్లుగా మీ విమర్శల్లో నుంచి మోడీ మరింత బలోపేతం అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఏ భారతీయ నాయకుడైనా విదేశీ గడ్డపై నుంచి సొంత దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయవచ్చా అని సభికులను ఉద్దేశించి అడిగారు. దేశంలో బుజ్జగింపు రాజకీయాలకు కులతత్వ, కుటుంబ రాజకీయాలకు మోడీ ఎండ్ కార్డు వేశారని అందుకే కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు భపడుతన్నాయని విమర్శించారు.

ఇవి కూడా చదవండి: ఎయిర్ పోర్టు ఫర్ సేల్..అమ్మకానికి తిరుపతి విమానాశ్రయం

Advertisement

Next Story

Most Viewed