- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. పార్టీ నూతన అధ్యక్షుడు ఇతడే..?
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ఎలా మారుస్తారు? న్యాయచిక్కులను ఎలా పరిష్కరిస్తారనే అనుమానాలను కేసీఆర్ అక్టోబర్ 5న నివృత్తి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరునుమాత్రమే బీఆర్ఎస్‌గా మార్చనున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ అన్ని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. తెలంగాణ భవన్‌లో నిర్వహించే టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. రాష్ట్రసాధించిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు పొందింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండుపర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టారు. అయితే దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్రానికి టీఆర్ఎస్ మధ్య స్నేహం బెడిసికొట్టడంతో ఏకంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గత కొంతకాలంగా జాతీయస్థాయిలో పార్టీ ఏర్పాటుకు పలువురితో సంప్రదింపులు చేశారు. కేంద్ర ఎన్నికలసంఘంతో పార్టీ పేరు మార్పుపై సంప్రదింపులు చేశారు. రాష్ట్ర ప్రణాళికసంఘం బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు పలువురు నేతలు కేసీఆర్ సూచన మేరకు ఢిల్లీకి పలుమార్లు వెళ్లివచ్చారు. ఫార్మాలిటీస్ ను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ప్రజల్లో బీఆర్ఎస్ పై సానుకూల ధోరణి ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ పేరును మారుస్తున్నారు.
తీర్మానంతోనే పార్టీ పేరుమార్పు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని 2001లో రిజిస్ట్రేషన్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఒక వైపు ఉద్యమిస్తూ మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి పలు స్థానాల్లో విజయం సాధించింది. 2004లో కాంగ్రెస్ పార్టీతో పోటీ చేశారు. 26 స్థానాల్లో విజయం సాధించారు. 2009లో 10 స్థానాల్లో విజయం సాధించారు. 2010లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 11 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మార్చాలంటే పార్టీ రాష్ట్ర కార్యవర్గ తీర్మానం సరిపోతుంది. ఈ తీర్మానంతో అపిడవిట్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఇస్తే పార్టీ పేరు మార్పు జరుగుతుంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ బీఆర్ఎస్ పేరుమీదకు మార్చాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
యథావిధిగానే కమిటీ....
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్పు చేస్తే రాష్ట్ర కమిటీని రద్దు చేయాల్సిన అవసరం లేదు. మార్పు చేయాలనుకుంటే ఆ అవకాశం కూడా ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ కొనసాగనున్నారు. అక్టోబర్ 5న దసరా రోజు తెలంగాణ భవన్ లో ఫార్మాలిటీ కోసమే టీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యవర్గానికి పార్టీ విధివిధానాలు వివరించనున్నట్లు సమాచారం.
3న ఎన్నికల కమిషన్ కు అపిడవిట్?
అక్టోబర్ 3వ తేదీన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పేరు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ అఫిడవిట్ అందజేయనున్నట్లు విశ్వసనీయసమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నుంచి సంతకాలు సైతం సేకరించినట్లు తెలిసింది. 5న పార్టీ ప్రకటన చేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో పార్టీకి ప్రతినిధులను నియమించనున్నట్లు సమాచారం.
Also Read: మరో హెలికాప్టర్ కొనుగోలుకు టీఆర్ఎస్ సిద్ధం.. విరాళాలు ఇస్తున్న దాతలు