- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేపర్ లీకేజీలు ఎలా అవుతున్నాయి..?.. మల్లు రవి
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం పకడ్భందీగా నిర్వహించాల్సిన పరీక్షల పేపర్లు ఎలా? లీకులు అవుతున్నాయని? టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...పేపర్ లీకేజీ అంశంలో సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నదన్నారు. టెన్త్పరీక్షల నిర్వహణ కూడా రాకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. పేపర్ లీకేజీలపై సీబీఐ విచారణ అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌పార్టీ ఫిర్యాదు చేసిందని స్పష్టం చేశారు. ప్రైవేట్,కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే పేపర్లీకేజ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలలో 50 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. 9 ఏళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వకుండా.. ఇప్పుడు ఆదరా బాదరగా ఇచ్చి పేపర్లీకేజీలకు కారణం అవుతుందన్నారు.
పేపర్లీకేజీపై ఎంక్వైరీ వేగంగా జరగడం లేదన్నారు. రెండు వారాల తర్వాత సిట్ ఇప్పుడు సభ్యులు, చైర్మన్‌ను విచారించడం ఏందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్ లో కాంగ్రెస్ వేసిన పిటిషన్ కు సమాధానం చెప్పేందుకు మాత్రమే చైర్మన్‌ను విచారిస్తున్నారన్నారు. మరోవైపు టెన్త్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తే ఎన్ఎస్యూఐ కార్యకర్తలను జైల్లో పెట్టడం దారుణమన్నారు. నిరుద్యోగులు ,విద్యార్థులు అంటే ప్రభుత్వం కు ఎందుకు అలసత్వం? అని విమర్శించారు. యూత్ కాంగ్రెస్అధ్యక్షులు శివసేనారెడ్డి మాట్లాడుతూ..మిగతా టెన్త్ పరిక్షలు సరిగ్గా నిర్వహించకపోతే..పిల్లలు, తల్లిదండ్రుల పక్షాన జైల్ భరో కార్యక్రమం తీసుకుంటామన్నారు. పదవ తరగతి పరీక్షలు అత్యంత లోపభూయిష్టంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి రోజు ఒక పేపర్లీకు అవ్వడం ఏమిటని? ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. సర్కార్వేగంగా చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్లు ముట్టడిస్తామని పేర్కొన్నారు.