ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తాండూరు శివారు దాటేదాక కొడ్తా.. టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత

by Javid Pasha |   ( Updated:2023-10-10 14:56:37.0  )
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తాండూరు శివారు దాటేదాక కొడ్తా.. టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత
X

దిశ, వెబ్ డెస్క్: టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తానంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తాండూరు శివారు దాటేదాక బెత్తం తీసుకొని కొడ్తానని కాల్వ సుజాత అన్నారు. రోహిత్ రెడ్డి లాంటి వ్యక్తులు కాంగ్రెస్ కు అవసరం లేదని స్పష్టం చేశారు. రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టరన్న ఆమె.. ఆయన ఆర్థిక వనరులు అన్ని తాండూరులోనే ఉన్నాయని అన్నారు. ఆయనకు అక్కడ పదుల సంఖ్యలో సుద్ద గనులు, సిమెంట్ ఇండస్ట్రీస్, స్టోన్ పాలీష్ ఇండస్ట్రీస్ ఉన్నాయని అన్నారు. తాండూరు నియోజకవర్గాన్ని రోహిత్ రెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కడి వ్యాపారుల నుంచి రోహిత్ రెడ్డి మామూళ్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావొద్దనే తాను కోరుకుంటున్నానని అన్నారు. మహేందర్ రెడ్డి మీద, అక్కడి ఎమ్మెల్యే మీద చాలా వ్యతిరేకత ఉందని చెప్పారు. చచ్చే దాక కాంగ్రెస్ పార్టీ కో సమే పని చేస్తానని చెప్పారు.

Advertisement

Next Story