- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఈసీ వద్దకు టీఆర్ఎస్ నేతల బృందం.. బీఆర్ఎస్‌ను ఆమోదించాలని విజ్ఞప్తి
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుతూ టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేసిన నేపథ్యంలో పేరు మార్పునకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం సీఈసీని కలిసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని అధికారులకు అందజేశారు. పేరు మార్పునకు ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా నేతలు కోరారు. వినోద్ బృందంలో పలువురు న్యాయవాదులు, పార్టీ నేతలు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
పేరు మార్పుతో పాటు టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న ఎన్నికల గుర్తునే బీఆర్ఎస్ కు వచ్చేలా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే దానికి ఎన్నికల గుర్తు రిజర్వ్ అవుతుంది. టీఆర్ఎస్ కు ఇప్పటికే కారు గుర్తు రిజర్వు అయింది. అయితే జాతీయ పార్టీకి మాత్రం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తు వస్తుంది. జాతీయ పార్టీగా మారే రాజకీయ పార్టీ తమకు ఒక గుర్తును కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న కారు గుర్తు ఇతర రాష్ట్రాల్లో ఏ ప్రాంతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి కూడా లేదు. దాంతో ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఉన్న కారు గుర్తునే బీఆర్ఎస్ కు సైతం కొనసాగించేలా సీఈసీ వద్ద టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.