- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గవర్నర్ విషయంలో స్పీడ్ పెంచిన సీఎం!
దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని మారుస్తూ గవర్నర్ తనకు నచ్చిన వాటినే చదివారని అధికార పక్షం ఆరోపించగా ఆ వెంటనే గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం చర్చగా మారింది. ఈ ఇష్యుపై డీఎంకే తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. గవర్నర్ సభ మర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా సభ నుంచి వాకౌట్ చేయడంపై సీఎం స్టాలిన్ సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలో గవర్నర్ పై మరింత స్పీడ్ పెంచిన డీఎంకే.. గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన డీఎంకే ఎంపీలో అసెంబ్లోలో చోటు చేసుకున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. నిజానికి చాలా కాలంగా గవర్నర్ రవికి స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజా పరిణామం నేపథ్యంలో ఇక మరింత దూకుడుగా వెళ్లాలనే ఆలోచనలో స్టాలిన్ ఉన్నట్టు తెలుస్తోంది.