చంద్రబాబు మేనిపెస్టోతో వైకాపాలో వణుకు.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

by Javid Pasha |
చంద్రబాబు మేనిపెస్టోతో వైకాపాలో వణుకు.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
X

దిశ, ఉత్తరాంధ్ర: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ప్రకటించిన జనారంజక ప్రజా సంక్షేమ మేనిపెస్టోతో వైకాపా మంత్రులకు వెన్నులో వణుకు పుట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు చరిష్మా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతలా అభి వృద్ధి చేశారో దేశం నలుమూలలా ఉన్న తెలుగువారందరికీ తెలుసని అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు ప్రకటించిన జనారంజక హామీలను చూసి వైకాపా మంత్రులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని చెప్పారు. మహానాడు, యువగళం కార్యక్రామానికి వచ్చిన ప్రజా స్పందనను చూసి ఓర్వ లేక నారా చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేళుతున్నారని దుయ్యభట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడిన మాటలు తెలుగువారిని హేళన చేసేవిధంగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకని మాట్లాడటం సరికాదని అన్నారు.

Advertisement

Next Story