కొడాలి నాని గ్రామ సింహం.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

by Javid Pasha |
కొడాలి నాని గ్రామ సింహం.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి కొడాలి నాని ఓ గ్రామ సింహం అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అభివర్ణించారు. కొడాలి నాని అరుపులకు సమాధానం చెప్పి, మాస్థాయిని కించపరుచుకోలేమని చెప్పుకొచ్చారు. బూతులమంత్రిగా పనిచేసిన కొడాలినాని గ్రామసింహం లాంటివాడు అయితే తాను ఏనుగు లాంటివాడినని చెప్పుకొచ్చారు. కొడాలి నాని మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

కొడాలి నాని పశుప్రాయుడు.. అతని పిచ్చికూతలకు, వెర్రిఅరుపులకు తాము సమాధానంచెబితే, మాస్థాయి, వ్యక్తిత్వం పడిపోతుందన్నారు. కొడాలి నాని వ్యాఖ్యల్ని అతని భార్యాబిడ్డలు హర్షిస్తారా? సభ్యత-సంస్కారం, చదువుసంధ్యలు లేకుండా, గాలికి తిరిగే వ్యక్తి మాటలకు తాము స్పందించాలా? అని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story