నేనంటే ఎందుకింత భ‌యం జ‌గ‌న్‌?.. లోకేశ్

by Javid Pasha |
నేనంటే ఎందుకింత భ‌యం జ‌గ‌న్‌?.. లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ''ఈ సెల్ఫీలో నా వెనుకున్న వాహ‌నం చూశారా? అదేనండి వ‌జ్ర వాహ‌నం. మ‌త‌క‌ల‌హాలు, ఘ‌ర్షణ‌లు చెల‌రేగిన‌ప్పుడు ఉప‌యోగిస్తారు క‌దా! అదే. ప్రశాంతంగా సాగుతున్న నా పాద‌యాత్రకి ర‌క్షణ క‌ల్పించాల్సిన‌ పోలీసులు జ‌గ‌న్ రెడ్డి ఆదేశాల‌తో అడ్డంకులు సృష్టిస్తున్నారు. అంత‌కుమించి వ‌జ్రవాహ‌నం అవ‌స‌రం ఏమొచ్చింది?'' అని లోకేశ్ నిలదీశారు. ' నేనంటే జ‌గ‌న్ రెడ్డికి భ‌యం. అందుకే అడుగ‌డుగునా అడ్డుకోవాల‌ని చూస్తున్నారు.

శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో నా పాద‌యాత్ర సుబ్బనాయుడు కండ్రిగ గ్రామం చేరింది. నా వెంట పోలీసులు, ఇదిగోండి ఈ వ‌జ్రవాహ‌నం కూడా జ‌గ‌న్ రెడ్డి పంపారు. ఇవి చూశాక మీరే చెప్పండి నేనంటే జ‌గ‌న్‌కి ఎందుకింత భ‌యం?' అని లోకేశ్ సెటైర్లు వేశారు.

Next Story

Most Viewed