- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలిటిక్స్‌లోకి స్టార్ డైరెక్టర్ VV వినాయక్.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ?
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. తామే అభ్యర్థులం అంటూ కొందరు ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా.. కొందరు టికెట్ కోసం అధిష్టానాల వద్ద పైరవీలు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఆంధప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాలు రంజుగా మారాయి. వైసీపీకి ధీటుగా టీడీపీ.. టీడీపీకి ధీటుగా వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉండగా.. వైసీపీలో మరింత సినీ గ్లామర్ యాడ్ చేసేందుకు సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ను వీవీ వినాయక్‌ను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ కల్యాణ్‌కు ధీటుగా సినీ గ్లామర్‌ను జోడించడంతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వినాయక్‌ను రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోందట. కాకినాడ లేదా? ఏలూరు నుంచి ఎంపీగా ఆయన్ను పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వినాయక్.. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వైసీపీకి ప్రచారం చేస్తారో లేడో అని సందేహం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
Read More: CM Jagan : వారికి కోసం 97.76 కోట్ల రూపాయలు కేటాయింపు.. నేడే ఖాతాల్లోకి సొమ్ము జమ