కాంగ్రెస్‌కు షాకిచ్చేలా శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-24 08:54:45.0  )
కాంగ్రెస్‌కు షాకిచ్చేలా శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేలా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అనే అంశంపై శరద్ పవార్ స్పందిస్తూ తాము ప్రస్తుతం మహా వికాస్ అఘాడిలో భాగస్వామిగా ఉన్నామని అలాగే కలిసి పని చేసేందుకు సుముఖంగా ఉన్నామన్నారు. కానీ కలిసి పని చేయాలనే కోరిక మాత్రమే ఉంటే సరిపోదన్నారు.

దానికి తగిన విధంగా పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఉండాలన్నారు. ఇతర సమస్యలపై ఇంకా చర్చ జరగలేదన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమికి నాయకత్వం వహించాలని చూస్తున్న కాంగ్రెస్‌కు శరద్ పవార్ తాజా కామెంట్స్ షాకివ్వనున్నాయా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ విషయంలో ఉద్దవ్ కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఎన్సీపీ అగ్రనేతల తీరు మహారాష్ట్రలో సంచలనంగా మారుతున్నది. అజిత్ పవార్ రూపంలో కూటమి నిలువునా చీలబోతోందనే ఊహాగానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి.

ఈ క్రమంలో దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ రియాక్ట్ అయ్యారు. మహా వికాస్ అఘాడి అలాగే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2024లో ఈ కూటమికి ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ ముందుకు నడిపిస్తారని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ కలిసి పోటీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరో వైపు తాజా పరిణామాలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. మహా వికాస్ అఘాడిపై శరద్ పవార్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్ కులే అన్నారు. సొంత ప్రజల చేత వదిలివేయడిన వారు నిజంగా ఎంవీఏని నడిపించగలరా అనేది పవార్ త్వరలోనే తెలుసుకుంటారని ఎద్దేవా చేశారు. మహా వికాస్ అఘాడి ఎంత దూరం వెళ్తుందనే దానిపై కూటమి నాయకులకే స్పష్టత లేదని సెటైర్లు వేశారు.

Also Read..

నేను ముసలోడిని అయిపోయా.. KTR ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed