సీనియర్ నాయకుడు రామచంద్ర యాదవ్ బీఆర్ఎస్ కు రాజీనామా

by Kalyani |
సీనియర్ నాయకుడు రామచంద్ర యాదవ్ బీఆర్ఎస్ కు రాజీనామా
X

దిశ, శామీర్ పేట: మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని తూంకుంట మున్సిపాలిటీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు చిరబోయిన రామచంద్ర యాదవ్ శనివారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ద్రోహం చేస్తున్నారని ఎస్టీ, ఎస్పీ, బీసీ మైనారిటీలకు పార్టీలో విలువ లేకుండా చేస్తున్నారని, రెడ్డి అని తోక ఉన్న వారికే పదువులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. మల్లారెడ్డి భూముల దందా, రియల్ ఎస్టేట్ దందా, పైసల దందా పెట్టుకుని ప్రజలను, పాలకులని మోసం చేస్తున్నారని దానికి విరుద్ధంగా మనస్తాపానికి గురై రాజీనామా చేయడం జరిగిందని అన్నారు.

గత 12 ఏళ్లుగా మంత్రి హరీష్ రావుతో కలిసి నడిచానని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకా ఏదైనా ఇతర పనుల నిమిత్తం వెళ్లిన సొంత తమ్ముడిలాగా పలకరిస్తారని అతని అనుచరుడిగా పేరు తెచ్చుకున్ననాకు ఏ మాత్రం విలువ లేకుండా చేస్తున్నారనే బాధతో రాజీనామా చేయడం జరిగిందని, మంత్రి మల్లారెడ్డి పైన వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష లేదని కేవలం అతని ఒంటెద్దుపోకడకు నిరసనగా రాజీనామా చేస్తున్నానని తెలిపాడు.

Advertisement

Next Story