నన్ను చంపడానికి ఏక్ నాథ్ షిండే కొడుకు సుపారీ ఇచ్చిండు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

by Javid Pasha |
నన్ను చంపడానికి ఏక్ నాథ్ షిండే కొడుకు సుపారీ ఇచ్చిండు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సుపారీ ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపించాలంటూ సంజయ్ రౌత్ అక్కడి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు లేఖ రాశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఏక్ నాథ్ షిండే సీఎం అయ్యాక తన సెక్యూరిటీని తగ్గించారని తెలిపారు. అయితే అందుకు తాను ఏమాత్రం బాధపడలేదని, కానీ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని ఆశించానని చెప్పుకొచ్చారు.

అంతకు ముందు శివసేన పార్టీ పేరు, సింబల్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సంజయ్ రౌత్ తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో రూ.2 వేల కోట్ల డీల్ జరిగిందని రౌత్ ఆరోపణలు చేశారు. కాగా సంజయ్ రౌత్ లేఖకు స్పందించిన ఫడ్నవిస్ 'సంజయ్ రౌత్ నాకు లెటర్ ఎందుకు రాశారు? నిజంగా సెక్యూరిటీ కోసమా లేక సెన్సేషన్ కోసమా? ఇలా ప్రతి రోజు అబద్దాలు ఆడటం వల్ల ప్రజల నుంచి వాళ్లు (ఉద్ధవ్ వర్గం) ఎలాంటి మద్దతు పొందలేరు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు సరైంది కాదు' అని ఫైరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed