కేంద్రమంత్రిని చూస్తే ఆ సామెత గుర్తొస్తున్నది: Revanth Reddy

by GSrikanth |   ( Updated:2022-08-18 09:25:54.0  )
కేంద్రమంత్రిని చూస్తే ఆ సామెత గుర్తొస్తున్నది: Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేసిన కామెంట్స్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కాళేశ్వరం అనీతిపై చర్యలకు కాంగ్రెస్ పార్టీ పదే పదే డిమాండ్ చేస్తే మీరు పెడచెవిన పెట్టారని ఆరోపించారు. తాము చెప్పినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మీరే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షెకావత్ తీరు చూస్తుంటే అరిచే కుక్క కరవదు అన్న సామెత గుర్తుకు వస్తోందని.. మాటలు సరే.. చర్యల సంగతి చెప్పండి సార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని, తెలంగాణకు ప్రధాన మంత్రి మోడీయే ప్రధాన శత్రువు అని కేసీఆర్ ఇటీవల చేసిన ఆరోపణలపై షెకావత్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో స్పందించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఇప్పుడు పంప్ హౌస్‌లు మునిగిపోవడంతో వాటి పునర్:నిర్మాణం, మరమ్మతుల పేరుతో మళ్లీ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నాడని సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో అవినీతి హద్దులుదాటిందని అన్నారు. షెకావత్ చేసిన కామెంట్లపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు వార్తా పత్రికల పేపర్ కటింగ్స్‌ను సోషల్ మీడియాలో జోడిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇకనైనా షెకావత్ మాటలు ఆపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story