- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.. రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం కర్ణాటకలోని బెలగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రాడ్యుయేట్లకు నెలకి రూ.3 వేలు, డిప్లొమా అభ్యర్థులకు నెలకి రూ.2వేల చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ఈ లోగా వారందరిీ ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. భారత్ జోడో యాత్ర సమయంలో ఉద్యోగాలు లేక యువత ఎంత బాధపడ్డదో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. అందుకే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని రాహుల్ స్పష్టం చేశారు.
ఇక బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకి రూ.2 వేల ఆర్థిక సాయం, 10 కిలోల బియ్యం, ఏడాదికి 2 వేల యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని తెలిపారు. ఈ దేశం రైతులు, కార్మికులు, యువకులు, పేదవాళ్లదన్న రాహుల్.. ప్రధాని మోడీ దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు అవినీతి కూపంలో కూరుకుపోయాయని ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం కమీషన్ వసూలు చేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.