- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొన్ని పార్టీలు ‘భ్రష్టాచార్ బచావో అభియాన్’ను మొదలు పెట్టాయి.. పీఎం మోడీ
దిశ, వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు ‘భ్రష్టాచార్ బచావో అభియాన్’ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాయని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఇటీవల నిర్మించిన బీజేపీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను మంగళవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవినీతి కేసుల్లో ఇరుక్కోవడమే కాకుండా రాజ్యాంగ సంస్థలైన కోర్టులు.. ఈడీ, సీబీఐ వంటి సంస్థలపై దాడి చేస్తున్నారంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ సంస్థలు దేశ ప్రగతికి దోహదపడతాయని, అయితే ఆ ప్రగతిని ఆపేందుకు కొన్ని శక్తులు రాజ్యాంగ సంస్థలపై దాడికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
దేశ ప్రయోజనాలను వ్యతిరేకించే శక్తులన్నీ ఏకం కావడం సర్వసాధారణమని తేల్చి చెప్పారు. కుటుంబ పాలనలో ఈ దేశం మగ్గిపోతున్న సమయంలో ప్రజల ఆదరాభిమానాలతో ఒక్క బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీగా నిలిచిందని అన్నారు. రెండు పార్లమెంట్ స్థానాలతో మొదలైన బీజేపీ ప్రస్థానం.. నేడు 303 ఎంపీ స్థానాలకు చేరిందన్నారు. చాలా రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా ఓటు బ్యాంకు బీజేపీ సొంతం అని అన్నారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు.. పశ్చిమం నుంచి తూర్పు వరకు బీజేపీ పాన్ ఇండియా పార్టీగా ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు.