- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నన్ను నిందించిన ప్రతిసారి కాంగ్రెస్ పతనమవుతూనే ఉంది’
దిశ, డైనమిక్ బ్యూరో: 'కాంగ్రెస్ పార్టీ తనను 91 సార్లు నిందించింది. ఆ పార్టీ తనను నిందించిన ప్రతిసారి కమలం వికసిస్తుంటే కాంగ్రెస్ మరింత పతనం అవుతోంది' అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ ఓ విష సర్పం లాంటి వారని ఆయన తెచ్చిన పథకాలు చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నా వాటిని రుచి చూస్తే చావు తప్పదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని పరోక్షంగా చురకలు అంటించారు. కాంగ్రెస్ మరోసారి తనను దుర్భాషలాడటం ప్రారంభించింది.
దుర్భాషలాడే పని కాంగ్రెస్‌ను చేసుకోనివ్వండి. నేను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తనను మాత్రమే కాదు లింగాయత్, అంబేద్కర్, వీర్ సావర్కర్ ఇలా అందరినీ నిందించడం అలవాటే అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇతరులును నిందించేందు కేటాయించిన సమయాన్ని సుపరిపాలన అందించడంపై దృష్టి సారిస్తే వారి పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. వారి నిందలకు కర్ణాటక ప్రజలే ఓట్ల ద్వారా జవాబు చెబుతారని అన్నారు. కర్ణాటక ఎన్నికలు ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాదన, ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా తీర్చి దిద్దడం కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి డబుల్ స్పీడు తో దూసుకుపోతుందన్నారు.