- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ అభివృద్ధి కాగితం మీద మాత్రమే కనబడతుంది.. ప్రధాని మోడీ
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అభివృద్ధి మొత్తం కాగితం మీదే కనబడతుందని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా శివమొగ్గలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు, రైతులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థినుల కోసం కనీసం టాయిలెట్లు కూడా కట్టించలేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు.
దీనివల్ల పాఠశాలల్లో డ్రాపౌట్స్ పెరిగాయని పేర్కొన్నారు. కానీ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యార్థినులకు జరిగిన అన్యాయాన్ని రూపుమాపామని, దీంతో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అలాగే మహిళలు, రైతుల కోసం కూడా తమ ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది మాత్రం తామేనని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు.