Breaking news: క్యాబినెట్ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రమాణస్వీకారం

by Indraja |
Breaking news: క్యాబినెట్ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రమాణస్వీకారం
X

దిశ వెబ్ డెస్క్: ఏపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ‘క్యాబినేట్ మంత్రిగా దేశ రక్షణ రహస్యాలను బహిర్గతం చేయడంగాని, లేదా వేరొక వ్యక్తి చెప్పడంగాని చేయనని, భారత రాజ్యాంగం పట్ల విధేయతతో నిజాయితీగా నడుచుకుంటానని, భారత దేశం పట్ల సమగ్రతను కలిగి ఉంటానని, రాజ్యాంగాన్ని అనుసరించి నిజాయితీగా, స్పృహతో నా బాధ్యతలు నెరవేరుస్తానని, కేంద్రమంత్రిగా రాజ్యాంగాన్ని అనుసరించి నిష్పక్షపాతంగా రాగద్వేషాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు సేవచేస్తానని దేవునిపై ప్రమానం చేస్తున్నాను’ అని ప్రమాణం చేశారు.

టీడీపీ తరుపున గుంటూరు నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చేందుకు కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు ద్రౌపథి ముర్ము సమక్షంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Advertisement

Next Story