- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్
దిశ వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో NDA కూటమి విజయం సాధించింది. దీనితో మోడీ ముచ్చటగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకార మహోత్సవం రాష్ట్రపతి భవనంలో అంగరంగ వైభవంగా జరిగింది. మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం తదాతర కేంద్రమంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.
కాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా మరోసారి నిర్మలా సీతారామన్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె నేడు డిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈమె రక్షణ శాఖ మంత్రిగా సైతం విధులు నిర్వహించారు. భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త, అలానే BJP సీనియర్ నాయకురాలుగా తనకంటూ ఓ గుర్తింపు సంపాధించుకున్ననిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వరుసగా 5సార్లు చోటు దక్కించుకున్నారు. అలానే 2021లో ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు.