Y. S. Vivekananda Reddy: వివేకా కేసులో కొత్త మలుపు.. ఆ కోర్టులో విచారణ

by Disha Web Desk 3 |
Y. S. Vivekananda Reddy: వివేకా కేసులో కొత్త మలుపు.. ఆ కోర్టులో విచారణ
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా.. నేటికీ ఆ కేసు కొలిక్కి రాలేదు. ముందుగా గుండెపోటుతో వివేకా చనిపోయారని వార్తలు వెలుగు చూసినప్పటికీ ఆ తరువాత గొడ్డలితో నడకడం కారణంగానే చనిపోయారు అనే నిజాలు వెలుగు చూసాయి.

అయితే 2019లో ఒక నెల ముందు వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు. ఈ హత్యను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేయించారని వైయస్ జగన్ ఆరోపించారు. అయితే వైసీపీ ఆరోపించినట్లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ హత్య చేయలేదు అని సీబీఐ ఎంక్వైరీలో తేలింది. ఇక వివేకానంద రెడ్డి హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం ఉన్నట్లు సీబీఐ ఎంక్వైరీలో తేలింది.

ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు వివేకా హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును మూల పడేసారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తన సొంత చెల్లెలు వైయస్ సునీత, వైఎస్ షర్మిల బహిరంగ సభల్లో తమ అన్న జగన్మోహన్ రెడ్డి హంతకులకు అండగా నిలుస్తున్నారని, ఎందుకు వివేకా కేసు విషయంలో ఎంక్వైరీ చెయ్యట్లేదని పదేపదే ప్రశ్నిస్తున్నారు.

కాగా ఎన్నికల నేపథ్యంలో వివేక హత్య కేసును ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం సరిరాదని వైసీపీ నేత సురేష్ కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ దాఖలు పిటిషన్‌పై విచారణ జరిపిన కడప కోర్టు.. ఎన్నికల వేళ వివేక హత్య కేసు గురించి ఎవరు మాట్లాడకూడదని ఉత్తర్వులు జారీ చేస్తూ వైఎస్ సునితకు, షర్మిలకు నోటీసులు పంపింది.

అయుతే ఈ తీర్పును వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్లపై హైకోర్టు ఎల్లుండి న్యాయ విచారణ జరపనుంది.

Next Story

Most Viewed