మోడీ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్!

by GSrikanth |   ( Updated:2023-04-01 14:46:06.0  )
మోడీ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోడీకి సంబంధించిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను పీఎంవో బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ గుజరాత్ హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మోడీ సర్టిఫికెట్ల అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ అవుతూ ప్రధాని అనే పోస్టులో ఉన్న వ్యక్తికి విద్యాబుద్ధులు ఉండటం చాలా ముఖ్యం అని అతడు ప్రతిరోజు అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ప్రధాని మోడీ డిగ్రీపై మరింత అనుమానాన్ని పెంచాయని, మోడీ నిజంగానే డిగ్రీ చదివి ఉంటే వాటిని ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.

ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తాను పూణే యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాన్నారు. ఈ రెండు సర్టిఫికెట్లను తాను పబ్లిక్ గా చేర్ చేయగలనని ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ తో పలువురు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. తమ సర్టిఫికెట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ట్రెండ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా పరిణామాలను చూస్తుంటే సర్టిఫికెట్ల విషయంలో విపక్షాలు భవిష్యత్ లో మోడీని మరింత ఇరుకున పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సర్టిఫికెట్లు బయట పెట్టినంత మాత్రాన గౌరవం, హోదా రాదని మోడీ మద్దతు దారులు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. దీంతో మోడీ సర్టిఫికెట్ అంశం ఎన్నికల అంశంగా ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది కాలమే నిర్ణయించనుంది.

Advertisement

Next Story

Most Viewed