- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోల్పోతాయి.. సీపీఐ జాతీయ కార్యదర్శి
దిశ ప్రతినిధి,తిరుపతి: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోపోతాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జ్యోష్యం చెప్పారు. గురువారం తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మీడియాతో మాట్లాడారు. ఎపిలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారని జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోడీ వెంటనే జగన్‌ను అరెస్టు చేయించాలని సూచించారు.
బటన్ నొక్కి నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నాడని ఎద్దేవ చేశారు. రాజకీయ విధానాలనే జనం నమ్ముతారని, నిత్యం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వ్యక్తి జగన్ అని తప్పుబట్టారు. పోలింగ్ కాక ముందు జగన్ ఇంటర్వ్యూ చూసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు జగన్ మొఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.
నరేంద్రమోడీ చేతిలో కేంద్రం ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారిందని ఆరోపించారు. చివరిదశలో మోడీ పోటీ చేసే వారణాసి లాంటి ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. గుజరాత్‌లో బీజేపీకి సీట్లు తగ్గుతాయని, యూపిలో అసలు రావని అన్నారు. మోడీ విధానాలపై విసుగెత్తి జనం ఓట్లు వేశారని.. ఓటింగ్ శాతం అందుకే పెరిగిందన్నారు. మోడీ పాలనలో నల్లధనం పెరిగిందని.. దేశ ఆస్తులను అదానీకి మోడీ అప్పచెబుతున్నాడని దుయ్యబట్టారు. మోడీ హయాంలో 16లక్షల కోట్లు ఎగ్గొట్టి 29మంది విదేశాలకు పారిపోయారని గుర్తు చేశారు.