Nara Lokesh: మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం..

by Indraja |   ( Updated:2024-06-12 06:40:38.0  )
Nara Lokesh: మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం..
X

దిశ వెబ్ డెస్క్: నేడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రులు సైతం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సైతం ప్రమాణస్వీకారం చేశారు.

నారా లోకేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతకరణ సుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రామాణం చేశారు.

లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, లేదా నాకు తెలియ వచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికి, వ్యక్తులకు తెలియజేయనని దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

Advertisement

Next Story