నేను చేతకాని అసమర్థుడిని.. ఆ దమ్ము, ధైర్యం ఉన్న నేత పవన్ కల్యాణ్‌: ముద్రగడ

by Indraja |
నేను చేతకాని అసమర్థుడిని.. ఆ దమ్ము, ధైర్యం ఉన్న నేత పవన్ కల్యాణ్‌: ముద్రగడ
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ కీలక నేత ముద్రగడ పద్మనాభం నేడు మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు, బలిజ యువత నా కంటే చిన్నవాళ్లైనా దన్యవాధాలు చెప్పుకుంటున్నాను. గతంలో జగన్ పాలనలో నేను ఉధ్యమం చేయండంలేదని, కేవలం స్వలాభం కోసమే ఉధ్యమాన్ని చేపట్టినట్టు పవన్ తరుచూ మాట్లాడే వారు, నేను చేతకానివాడిని, అపమర్థుడని, అమ్ముడుపోయాను కనుక ఉద్యమాన్ని కొనసాగించలేక పోయాను, అలానే కాపుల కోరికను సైతం నెరవేర్చలేక పోయాను.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి, కాపుల చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటున్నాను, ఆ దిశగా మీరు తలచుకుంటే అతి త్వరలోనే కాపులకు రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకుందని నేను భావిస్తున్నాను. ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు వేయమని నేను కోరుతున్నాను, మీ ప్రభుత్వం అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకు చాలా విలువిస్తారు, కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమంపై ధృష్టి పెట్టండి.

అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడానికి గతంలోనే కేంద్రం తీర్మాణం చేసింది, ఈ రోజు మీ చేతుల్లో కేంద్రం కీలు బొమ్మ కనుక స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా ప్రయత్నం చేయండి. అలనే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే యువత నిత్యం మెసేజెస్ ద్వారా భూతులను పెడుతున్నారు.

ఇంది మంచిపద్దతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టించాలి అని అనుకుంటే పెట్టండి నేనేం భాధ పడను, దానికన్నా ఒకటి చేయండి, మా కుటుంబంలో 7 మందిమి ఉన్నాం, పంపిచండి మనుషులని, చంపించేయండి మమ్మల్ని, మేము అడ్డుపడం, ఎందుకంటే మేము అనాథలం ఈనాడు. అంతేకాని భూతులు మాట్లాడించడం ఆపించమని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం.’ అంటూ ఆయన భావోద్వేగానికి గురైయ్యారు

Advertisement

Next Story