చిరంజీవి విషం చిమ్మడం స్టార్ట్ చేశారు.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-08-12 16:38:21.0  )
చిరంజీవి విషం చిమ్మడం స్టార్ట్ చేశారు.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదని.. రీమేక్ స్టార్ అని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొండలపై భవనాలు కట్టకూడదనడం పవన్ అజ్ఞానమని విమర్శించారు. అంతేగాక.. మెగాస్టార్ చిరంజీవిపైనా విమర్శలు చేశారు. ఇన్నాళ్లూ చిరంజీవి పెద్దమనిషిగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండే వ్యక్తి అని భావించామని, కానీ సడన్‌గా ఆయనకు ఏమైందో కానీ జగన్‌కు సలహాలు ఇస్తూ విషం చిమ్మడం ప్రారంభించారంటూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇల్లు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కోండపైనే ఉన్నాయన్నారు. కోర్టు నిబంధనలకు లోబడే రుషికొండపై నిర్మాణాలు జరుగుతున్నాయని.. కోర్టుల కంటే పవన్‌ గొప్పవారా అంటూ మంత్రి రోజా విమర్శించారు. రుషికొండ పర్యటన పేరుతో పవన్ హడావుడి చేశారని.. సుప్రీంకోర్టు నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తిచేశారు.


రజనీకాంత్ ఎనర్జీ సీక్రెట్ ఇదే.. హిమాలయాల్లో దొరికే అవి తినడం వల్లే..

Advertisement

Next Story