వాళ్లకు కాసుల పంట.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట: KTR

by GSrikanth |   ( Updated:2022-10-14 04:18:36.0  )
వాళ్లకు కాసుల పంట.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట: KTR
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గ్యాస్ ధరల పెంపుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం.!! ఆడబిడ్డలపై ఆర్థిక భారమా? Modi పాలనలో ధరలు ఆకాశంలో.. ఆదాయాలు పాతాళంలో.. ఆయిల్ కంపెనీలకు కాసుల పంట.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట. ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా? గరీబోల్ల గుండెలపై మోయలేని గుదిబండలు..ఈ గ్యాస్ బండలు'' అంటూ ట్విట్టర్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story