రాహుల్ పై అనర్హత వేటు అప్రజాస్వామికం.. కేటీఆర్

by Javid Pasha |   ( Updated:2023-03-24 11:38:46.0  )
రాహుల్ పై అనర్హత వేటు అప్రజాస్వామికం.. కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు వేయడాన్ని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ పై అనర్హత వేటు అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమని అన్నారు.

‘‘మొదట వాళ్లు కమ్యూనిస్టుల దగ్గరికి వచ్చారు. అయితే నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి నాకెందుకని పట్టించుకోలే. తర్వాత వాళ్లు సోషలిస్టుల దగ్గరికి వచ్చారు. ఈ సారి కూడా నేను సోషలిస్ట్ ను కాదు కాబట్టి నాకెందుకు అని ఊరుకున్నా. అనంతరం వాళ్లు ట్రేడ్ యూనియన్ లీడర్ల వద్దకు వచ్చారు. యధావిధిగా నాకెందుకులే అని వదిలేశా. ఈ సారి వాళ్లు యూదుల వద్దకు వచ్చారు. మళ్లీ నాకెందుకు అని పట్టించుకోలేదు. కానీ వాళ్లు ఇప్పుడు నా వద్దకు వచ్చారు. కానీ నా గురించి మాట్లాడటానికి ఎవరూ మిగలలేదు’’ అంటూ మార్టిన్ నిమోల్లర్ చెప్పిన సూక్తిని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో షేర్ చేశారు.

కాగా రాహుల్ గాంధీని సమర్థిస్తూ కేటీఆర్ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ తదితరులు బీజేపీపై మండిపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వాలను ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేసులతో వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed