- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబందులొస్తున్నాయ్..జాగ్రత్త: మంత్రి కొట్టు సత్యనారాయణ సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధుల బకాయిలు విడుదల చేయడంపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యజ్ఞ ఫలితంగానే రాష్ట్రానికి పెండింగ్ నిధులు విడుదలయ్యాయని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం శ్రీమహాలక్ష్మీ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించిందని...యజ్ఞ ఫలితంగానే రాష్ట్రానికి పెండింగ్ నిధులు వచ్చాయని చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.యజ్ఞఫలితంతో సీఎం జగన్ ప్రయత్నం సఫలమైనట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. పీఠాధిపతులు సూచనల మేరకు కార్తీకమాసంలో శ్రీశైలంలో కుంభాభిషేకం నిర్వహించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను సంబంధిత ట్రస్ట్ బోర్డు నిర్వహించేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయా దేవాలయాలపై పర్యవేక్షణ దేవాదాయశాఖకు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
అంతేకాదు లీజు ముగిసినా కోర్టును ఆశ్రయిస్తూ స్టేలు పొందే వారిపై 15 రోజుల నోటీసుతో చర్యలు తీసుకునేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రజలకు వైసీపీ చేసిన మేలు చెప్పి 2024లో ఓట్లు అడుగుతామని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని రాబంధులు వాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని అలాంటి వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలుగా కొట్టు సత్యనారాయణ అభివర్ణించారు. 2024 ఎన్నికలు సత్యానికి, అసత్యానికి...న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటంగా మంత్రి కొట్టు సత్యనారాయణ అభివర్ణించారు.