- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 25కు వాయిదా పడింది. గురువారం రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాఘవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తిహార్ జైలు అధికారులు హాజరుపరచకపోవడంపై స్పెషల్ కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే విచారణ సందర్భంగా కచ్చితంగా రాఘవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చాలని ఆదేశించింది. కాగా లిక్కర్ కేసులో ఫిబ్రవరి 11న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ కోర్టు ఈటీవలే పొడిగించింది.
Next Story