- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana: ల్యాండ్ గ్రాబర్ రౌడీ షీటర్ అరెస్ట్
దిశ, కుత్బుల్లాపూర్ : గాజులరామారంలో భూ కబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకుడు అభిద్‌ను జగద్గిరిగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సర్వే నెంబర్ 342,307లలో పలు భూ కబ్జాలకు పాల్పడిన అభిద్‌పై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో 16 కేసులు పైగా నమోదు అయ్యాయి. భూ కబ్జాలకి పాల్పడిన వ్యక్తులపై రెవిన్యూ అధికారులు పలుమార్లు ఫిర్యాదులు, పత్రికలలో వార్తా కథనాలతో జగద్గిరిగుట్ట పీఎస్‌లో కొందరిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు అయ్యాయి.
అయితే గాజులరామారం ల్యాండ్ కబ్జాదారులకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాస్‌లు పుల్ సఫోర్ట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్‌లు ఎన్నో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో అయినట్లు విమర్శలు వస్తున్నాయి. కాగా సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు అభిద్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరి మిగతా ల్యాండ్ గ్రాబర్స్ అరెస్ట్ ఉంటుందా? లేదా? అని పౌరులు ప్రశ్నిస్తున్నారు.