- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశానికి దిశ చూపిన వ్యక్తి అంబేద్కర్.. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగం రచించి ఈ దేశానికి దిశ చూపిన వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ సత్యాగ్రహ సభలో ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు ఓటు అనే ఆయుధం ఇచ్చారని అన్నారు. కానీ ఇవాళ అంబేద్కర్ ఆశయాలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిదని అన్నారు.
దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి నేతలు చాలా కృషి చేశారని కొనియాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసం పాటుపడటం లేదని ఖర్గే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.