- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: ఎంపీ పదవికి కేశినేని నాని రాజీనామా .. స్పీకర్ ఫార్మాట్‌కు లేఖ
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌కు రాజీనామా లేఖను పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
కాగా విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఇటీవల టీడీపీకి రాజీనామా చేశారు. కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు ఖరారు చేస్తారని తెలియడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న తన కుమార్తె శ్వేతతోనూ ఆ పార్టీకి రాజీనామా చేయించారు.
ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్‌తో భేటీ అయిన ఆయన ఇక తన ప్రయాణం వైసీపీతోనేనని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో తనకు నాలుగు సీట్లు ఇవ్వాలని జగన్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో తన ప్రతిపాదించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే సీట్లతో పాటు తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ వెస్ట్ స్థానంలో తన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ పెడతానని సీఎం జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సీఎం జగన్‌తో భేటీ ముగిసిన కొద్దిసేపటికే కేశినేని నాని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో విజయవాడ రాజకీయం మరింత వేడెక్కింది.