కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2023-02-15 14:56:34.0  )
కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ భక్తులు కావాలా లేక టిప్పు సుల్తాన్ వారసులు కావాలా అంటూ ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలోని ఎలబుర్గా టౌన్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నళిన్ కుమార్ కటీల్ మాట్లాడుతూ.. తాము రాముడు, హనమంతుడి భక్తులమని, హిందూ దేవుళ్లను పూజిస్తామని చెప్పారు. కానీ తాము టిప్పు సుల్తాన్ వారసులం ఏమాత్రం కామని, టిప్పు సుల్తాన్ వారసులను అడవులకు పంపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మీరు హనుమంతున్ని పూజిస్తారా లేక టిప్పు సుల్తాన్ ను పూజిస్తారా? టిప్పు సుల్తాన్ వారసులను అడవుల్లోకి పంపుతారా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రాష్ట్రానికి హనుమంతుడు కావాలా లేక టిప్పు సుల్తానా? టిప్పు సుల్తాన్ అనుచరులకు ఈ నేలపై బతికే అవకాశం ఏమాత్రం ఇవ్వనని సవాలు విసురుతున్నా'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా.. హనుమాన్ వర్సెస్ టిప్పు సుల్తాన్ గొడవ 2018 కర్ణాటక ఎన్నికల సమయంలో మొదలైంది. కర్ణాటకలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. కర్ణాటక హనుమంతుడు నడిచిన నేల అని అన్నారు. దురదృష్టవశాత్తు ఇక్కడ కొంతమంది హనుమాన్ కు బదులు టిప్పు సుల్తాన్ ను పూజిస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీకి పట్టం కడితే టిప్పు సుల్తాన్ ను పూజించేవారుండరని అన్నారు. అంతకు మందు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను వరుసగా రెండు సంవత్సరాలు నిర్వహించింది.

Also Read..

పెట్రోల్, డిజిల్‌పై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన!

Advertisement

Next Story