కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్: ఆ రైతులకు తీరని నష్టం: Konda Vishweshwar Reddy

by srinivas |   ( Updated:2022-09-13 11:11:18.0  )
కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్: ఆ రైతులకు తీరని నష్టం: Konda Vishweshwar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే, లక్ష్మీ పంపుహౌస్ నిర్మాణ సమయంలో తోడిన మట్టిని బీర సాగర్ వెళ్లే దారిలో కుప్పలుగా వేశారు. దీంతో వర్షం పడినప్పడు బురదనీరు పంట పొలాల్లోకి వచ్చి చేరుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. దీనిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''కన్నపల్లి రైతులకు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా వారి పొలాలు మునిగిపోతున్నాయి. ఇటీవల ఇళ్లు నీటమునగడంతో వారి గ్రామం మొత్తాన్ని తాత్కాలికంగా ఖాళీ చేయించారు. కాళేశ్వరం మీ పెంపుడు ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతుల సమస్యలను పరిశీలించండి.'' ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed