CBN: సంక్షేమ పథకాలతో అభివృద్ధి సాధ్యమేనా..? బాబు విజన్ ఇదేనా..?

by Indraja |   ( Updated:2024-06-14 07:38:40.0  )
CBN: సంక్షేమ పథకాలతో అభివృద్ధి సాధ్యమేనా..? బాబు విజన్ ఇదేనా..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హీమీలపైన దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టి 48 గంటలు గడవక ముందే పెన్షన్‌లను పెంచుతున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

అలానే జగనన్న విధ్యా దీవెన పేరును స్టూటెంట్ కిట్‌గా మార్చారు. అయితే ఇప్పటికే అప్పుల కుప్పగా మారింది ఆంధ్రప్రదేశ్. ఏపీలో గత ప్రభుత్వం సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించింది. రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. దీనితో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కాగా అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏర్పాటై 48 గంటలు గడవకముందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల పరంపరను కొనసాగిస్తున్నారు.

అయితే విజన్ ఉన్న నేతగా, రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన నారా చంద్రబాబు వ్యూహం ఏంటి..? ఇచ్చిన మాట ప్రకారం మ్యానిఫెస్ట్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న చంద్రబాబు, ఖాళీ ఖజానాతో అభివృద్ధిని ఎలా సాధిస్తారు..? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

పెన్షన్ల పెంపు..

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచుతున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై నెలకు.. వృద్ధులు, వితంతువులు, చేనేత, మత్స్యకారులకు రూ.4000, వికలాంగులకు రూ.6 వేలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి రూ.10 వేలు, పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15 వేల పెన్షన్ ప్రభుత్వం అందించనుంది.

సంక్షేమంతో అభివృద్ధి సాద్యమేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నేటికి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఏపీ దుస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అక్కడ రాజధాని నిర్మాణ పనులను సైతం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు సైతం ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.

అయితే 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే రాజధాని నిర్మాణం పనులు జరుగుతున్న అమరావతిని పక్కన పెట్టింది. మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చింది. దీనితో ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు అప్పు చేసింది.

సంక్షేమ పథకాల గురించి తప్న అభివృద్ధి గురించి ఆలోచించలేదు. అయితే చంద్రబాబు సైతం సంక్షేమ పథకాల పరంపరను కొనసాగిస్తున్నారు. అయితే ఈయన కేవలం సంక్షేమ పథకాలే కాదు రాష్టం అభివృద్ధి చెందడం కూడా చాలా అవసరం అంటున్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిని సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పల్లేలే రాష్ట్రానికి పట్టుకొమ్మలా..?

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఉద్యోంగం, ఉపాధి రెండు చాలా ముఖ్యం అని విశ్లేషకులు అంటున్నారు. అయితే చంద్రబాబు గ్రామాల్లో చిరు వ్యాపారులను, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని భావిస్తున్నట్టు సామాచారం. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో సైతం చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రరటించింది.

రైతులు, చేనేత కార్మికులు ఇలా పలువురిని ప్రోత్సహించేలా మేనిఫెస్టో ఉంది. అలానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అలానే బీజేపీతో పొత్తు పెట్టుకునే సమయంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా చంద్రబాబు మోడీ దగ్గర మాట తీసుకున్నట్టు సమాచారం. కాగా చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర భవిష్యత్తు మారనుందని పలువురు పైర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed