- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా.. MP ఎన్నికల్లో కలిసొచ్చేనా?
దిశ, వెబ్ డెస్క్: ఆ రెండు రాష్ట్రాలు బీజేపీకి ఆయువుపట్టుగా మారాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలు ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీకి కీలకంగా మారనున్నాయి. 105 స్థానాలు ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో సత్తా చాటితే అధికారం చేజిక్కించుకోవడం సులువు అని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎంపీ ఎన్నికల వరకు ఈ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి.
కీలకంగా యూపీ, గుజరాత్
దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్నా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 79 ఎంపీ స్థానాలుండగా 2019 ఎంపీ ఎన్నికల్లో 61 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ రెండో సారి అధికారంలోకి రావడానికి యూపీ ఫలితాలు కీలకంగా మారాయి. గుజరాత్లో సైతం 2019 లోక్ సభ ఎన్నికల్లో 26 స్థానాలకు గాను బీజేపీ అన్ని స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. కాగా ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 255 సీట్లలో గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకుంది. 2024లో రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉండటం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి కలిసివస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
పెరిగిన బలం..
దేశంలో మొత్తం 543 ఎంపీ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలను గెలుచుకుంది. పొత్తులో భాగంగా మొత్తం 353 స్థానాలను కైవసం చేసుకుని వరుసగా రెండోసారి తిరుగులేని ఆధిక్యంతో అధికారం చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితమైంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 282 సీట్లు సాధించిన బీజేపీ రెండో సారి 303 సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ 44 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎంపీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 272 సాధించాలంటే కావల్సిన ఎంపీ స్థానాల విషయంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషించనున్నాయి.
105 ఎంపీ స్థానాలు..
రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 105 ఎంపీ స్థానాలు ఉండగా అధికారంలోకి రావాలనుకునే పార్టీకి ఈ రెండు అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పొచ్చు. అందులో భాగంగానే మోడీ అమిత్ షా ద్వయం మూడో సారి అధికారం చేపట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సత్తా చాటిన ఊపుతో ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రచార బాధ్యతలను ఈ సారి కూడా మోడీయే తీసుకుని ముందుకు సాగనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టిన ఈ రెండు రాష్ట్రాల ప్రజలు మరి 2024 ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read More....